సాధ్యమైనంత మంది ప్రజలను చేరుకొని వారితో మాట్లాడడం మరియు వారి సాధకబాధకాలను వినడానికి గాంధీజీ ఎక్కువగా ఆసక్తి చూపేవారు. అనేక భాషలలో కాలానుగత పత్రికా సంచికల ప్రచురణ అటువంటి సమాచార వినిమయ రూపాలలో ఒకటి. గాంధీజీ విభాగ వార్తా సంచికలు అతడు స్వయంగా వ్రాసిన, సంపాదకత్వం వహించిన లేదా ప్రచురించిన పూర్తి పాఠాలను అందిస్తాయి. గాంధీజీ ఆలోచనలు మరియు ఆచరణలు అనేక ఉద్యమాలకు మరియు విద్యా విషయాలకూ స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఇతరుల విభాగము యొక్క వార్తా సంచికలు, గాంధీజీచే స్ఫూర్తి పొందిన సంస్థలు మరియు గాంధీజీ యొక్క ఆలోచనలు మరియు ఆచరణలను లేదా గ్రంధస్థాలను ప్రశ్నించిన ఉద్యమాలు ప్రచురించిన ప్రచురణల సంకలనాలను, పత్రాలను మరియు కాలానుక్రమ ఉద్యమాల వివరాలనూ అందిస్తాయి. ఈ వార్తా సంచికల యొక్క సంపూర్ణ, అసంక్షేపిత విషయాంశాలు ఇక్కడ అందించబడ్డాయి.